
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి లో గ్రామైఖ్య సంఘం, అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి టీచర్ బోల రాధ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అంగన్వాడి టీచర్ బోళ్ల రాధ వివరించారు. ప్రతి గర్భిణీ పౌష్టికాహరం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అంబాల సుమలత, కార్యదర్శి వంగపండ్ల కొమురమ్మ, పంచాయతీ కార్యదర్శి స్వప్న, సిఏ బోణగాని రమ, ఏఎన్ఎం మంద సుమలత, ఆశా కార్యకర్త కొండ్ర అన్నపూర్ణ, మహిళా సంఘం సభ్యులు ఇతర మహిళలు పాల్గొన్నారు.

