
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నాగార్జున మిల్క్ ప్రోడక్ట్ డైరీలో హైదరాబాదు రూట్ డ్రైవర్ గా పని చేసే రవి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగార్జున మిల్క్ ప్రోడక్ట్ డైరీ యాజమాన్యం మానవతా దృక్పథంతో డ్రైవర్ కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ, 40,000 డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆలోచన మేరకు సోమవారం డైరీ సీఈవో కృష్ణ ప్రసాద్, డైరీ ఏజీఎం ఆకునూరి సుధాకర్ ల చేతుల మీదుగా మృతుడు రవి భార్య, కుమారుడికి రూ. 40,000 నగదును అందజేశారు. పెద్ద మనసుతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చి నగదు అందజేసిన డైరీ యజమాన్యంకు, సిబ్బందికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సంపత్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
