
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వీధి కుక్కల బెడద తగ్గించడం కోసం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో బుధవారం పశు వైద్యశాల ఆవరణలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక ప్రారంభించారు. వీధి కుక్కల బెడద అధికముగా ఉన్నందున, వాటిని పట్టుకొని జనన నియంత్రణ ఆపరేషన్ల నిర్వహించుటకు నూతనంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘము పాలకవర్గ సభ్యులు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి సాంబరాజు, వార్డు అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, సానిటరీ జవాన్లు ప్రతాపరాజు ఆరెల్లి రమేష్, పి అనిల్ కుమార్, రోంటాల సుధీర్, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

