మిస్డ్ కాల్ చేయండి -ఓటు నమోదు పొందండి.పట్టభద్రుల సౌకర్యార్థం మొబైల్ నంబర్ 9240021444..మిస్డ్ కాల్ క్యాంపియన్ పోస్టర్ ను ఆవిష్కరించిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పట్టభద్రుల ఓటరు నమోదు సులభతరం చేసేందుకు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఒక మొబైల్ నెంబర్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్ లో పట్టబద్రుల ఓటు నమోదు కోసం మిస్డ్ కాల్ క్యాంపియన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ నమోదు కోసం మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఓటు నమోదు చేసుకునేందుకు 50 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము కేటాయించిన నంబర్ 9240021444 కు మిస్డ్ కాల్ చేసినట్లయితే తమ సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఓటు నమోదుకు సహకరిస్తారని వెల్లడించారు. ఓటరు నమోదుకు ఒక కలర్ ఫోటోతో పాటు, ఆన్ లైన్ ఒరిజినల్ డిగ్రీ మెమోను అప్ లోడ్ చెయ్యాలని పేర్కొన్నారు. గతంలో 1, లక్ష 97 వేల పట్టబధ్రులు మాత్రమే ఓటర్లుగా నమోదు కాబడ్డారని ..ఇప్పుడు 4లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ గా పనిచేస్తున్నామని వెల్లడించారు.

  • ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంటు నిధుల విడుదలకు సహకరిస్తా..

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల ఫీజు రియంబర్స్ మెంటు నిధులు విడుదల గాక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం సమన్వయం పాటించాలని కోరారు. గత నెల రోజులుగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల వ్యాప్తంగా ఓటర్ నమోదు అవగాహన కోసం పర్యటించానని చాలామంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనవుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏల మంజూరుకి కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత కోసం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా నిరుద్యోగులకు 6 నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉమ్మడి నాలుగు జిల్లాలలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తాను ఎమ్మెల్సీగా ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..ప్రస్తుతం తాను సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఓ ప్రధాన పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. పార్టీ టికెట్ రానట్లయితే స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!