మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలపై గందరగోళం నెలకొంది అని బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ ఆరోపించారు. హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలపై తేదీ 11 10 2024 రోజున ఆర్ అండ్ బి చీఫ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ గ్రామాలు మరియు మున్సిపల్ వార్డులలో ఇందిరమ్మ కమిటీలు చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ 33 తేదీ 11. 10 . 2024 రోజున జీవో జారీ చేశారన్నారు. ఇందులో గ్రామపంచాయతీ లెవల్లో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా, పంచాయతీ సెక్రెటరీ కన్వీనర్ గా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు సంబంధించిన ఇద్దరు మహిళలను సభ్యులుగా మరియు గ్రామంలో అభివృద్ధి పై అవగాహన ఉన్న ముగ్గురు అందులో ఒకరు ఓపెన్ కేటగిరి నుండి మరొకరు బీసీ నుండి ఒకరిని ఎస్సీ నుండి తీసుకొని కమిటీ వేయాలని పేర్కొన్నారన్నారు. మున్సిపాలిటీలో వార్డ్ కౌన్సిలర్ చైర్మన్ గా, వార్డ్ ఆఫీసర్ కన్వీనర్ గా, ఇద్దరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు మరియు వార్డ్ అభివృద్ధి కోరుకునే ముగ్గురు ఒకరు జనరల్ కేటగిరి నుండి ఒకరు బీసీ నుండి ఒకరిని ఎస్సీ నుండి ఎన్నుకోవాలని, గ్రామ పంచాయతీలు అయితే గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామస్తులు అందరి సమక్షంలో ఏలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎన్నుకోవాలనీ, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ వార్డు సమావేశం ఏర్పాటు చేసి పైన తెలిపిన కమిటీని ఎన్నుకోవాలన్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో అందుకు భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయని, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామానికి ఐదుగురు చొప్పున లిస్టు తీసుకుని కలెక్టర్ కి అందజేశారని, అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ బాబు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి గ్రామానికి ఐదుగురు చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు సెలెక్ట్ చేసి కలెక్టర్ కి పంపారని కరుణాకర్ ఆరోపించారు. అంటే కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు మాత్రమే కమిటీలలో ఉండాలని పేద ప్రజల ఇచ్చే ఇందిరమ్మ కమిటీలో పారదర్శకంగా నిర్వహించాల్సి ఉండగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా కమిటీలు వేసి కలెక్టర్ కు పంపించడంను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందన్నారు. కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి వెంటనే గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలను పారదర్శకంగా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తే గ్రామాలలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అంది నిజమైన పేదలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ పేర్కొంటుందని, కానీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలతో కమిటీలు వేస్తే గ్రామాలలో చిల్లర రాజకీయాలు మొదలవుతాయని కాబట్టి కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పారదర్శకంగా వార్డు సర్వసభ్య సమావేశం మరియు గ్రామ పంచాయతీలలో గ్రామసభ ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. లేకపోతే దీనిపై భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు రాముల కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్ర శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకురాలు పి లక్ష్మి నారాయణరెడ్డి, కొండల్ రెడ్డి, ఉప్పు మహేష్, కొంకటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Home
- హుజరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలపై గందరగోళం?! బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్