మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో అక్టోబర్ 27 నాడు జంబుద్వీప మహాకవి చక్రవర్తి ఎర్ర ఉపాలి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కరపత్రాల ఆవిష్కరణలో భాగంగా నేడు హుజురాబాద్ పట్టణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, బహుజన మేధావులు, కళా సంఘాలు, ఇంటలెక్చువల్, మేధావులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఎర్ర ఉపాళి విగ్రహావిష్కరణ విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్ర ఉపాలి కుమారుడు ఎర్ర సూర్య నేనే పాల్గొనడం జరిగింది. ప్రముఖ బహుజన వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, తునికి సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, మోరె సతీష్, భీమోజు సదానందం, ఆకినపల్లి ప్రవీణ్, మిడిదొడ్డు శ్రీనివాస్, రామగిరి అంకుస్, పులి ప్రకాష్, తిప్పారపు భువనచంద్ర్ర, అరికెళ్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
- Home
- జంబుద్వీప మహాకవి చక్రవర్తి ఎర్ర ఉపాలి విగ్రహ ఆవిష్కరణకు కరపత్రాల ఆవిష్కరణ