మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పద్మశాలిలలో రాజకీయ చైతన్యం రావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాల్సిన అవసరం ఉందని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి అన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కరీంనగర్లోని పద్మశాలి సంక్షేమ ట్రస్టు భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకుందామని, అలాగే పద్మశాలీలు సైతం చట్టసభల్లో గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 20 ఏళ్ల క్రితం రాజకీయంగా పద్మశాలీలు ఎంతో ముందుండేవారిని నేడు అవకాశాలను చేజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ తెలంగాణ ప్రాంత రాష్ట్ర మాజీ అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు తెలంగాణ పద్మశాలి సంఘానికి ఆణిముత్యం లాంటి వాడని అన్నారు. సంఘం కోసం విశేషంగా కృషి చేసేవాడని కొనియాడారు. వారి స్ఫూర్తి, ఆశయాల కోసం తెలంగాణ పద్మశాలి సంఘం ముందుకు వెళుతుందని అన్నారు. వారి ఆశయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం అభినందనీయం పేర్కొన్నారు. సంఘం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు పద్మశాలి శంఖారావం పేరుతో హైదరాబాద్ లో పద్మశాలీల ఐక్యత కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంఘం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశాడని కొనియాడారు. తన ఉద్యోగ విరమణ అనంతరం 20 గంటల స్థలాన్ని మార్కండేయ దేవాలయానికి కేటాయించడం గొప్ప విషయం అన్నారు. ప్రభాకర్ రావు వర్ధంతి డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుందని అతని జీవిత చరిత్రను పుస్తక రూపంలో విడుదల చేయనట్లు తెలిపారు. తెలంగాణ పద్మశాలి సంఘం ప్రాథమిక సభ్యత్వం 10 రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. గడువు పూర్తయిన జిల్లాలలో పద్మశాలి జిల్లా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 33 జిల్లాల్లో పద్మశాలీలు రాజకీయంగా బరిలో ఉండాలని అందుకు తెలంగాణ పద్మశాలి సంఘం అండగా ఉంటుందని అన్నారు. వచ్చే తెలంగాణ ప్రభుత్వం మార్చిలో తెలంగాణ పద్మశాలి సంఘం అనుబంధంతో అఖిలభారత పద్మశాలి సంఘం పదివేల మందితో భారీ మహాసభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 సంవత్సరాలుగా పద్మశాలీలు రాజకీయంగా రాణించడం లేదన్నారు. మహబూబ్ నగర్ లో స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పద్మశాలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం లక్ష రూపాయలు విరాళంగా అందజేస్తారని ప్రకటించడం రాష్ట్ర సంఘానికి గర్వకారణం అన్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు ఆర్థిక నివేదికను, పలు అంశాలను కార్యవర్గంలో చదివి వినిపించారు. అంతకు ముందు స్వర్గీయ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శి వొళ్లాల కృష్ణహరి, రాజకీయ విభాగం జాతీయ అధ్యక్షుడు బోల్ల శివకుమార్, జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు అవ్వారి భాస్కర్, రాజకీయ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బొమ్మ ప్రవళిక, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర మీడియా అధ్యక్షులు బొమ్మ అమరేందర్, ప్రధాన కార్యదర్శి మార్త ప్రకాష్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి బొమ్మ రఘురాం, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వివిధ అనుబంధ విభాగం అధ్యక్షులు స్వర్గం మల్లేశం, పోలు సత్యనారాయణ, దూడం శ్రీనివాస్, గుడిమల్ల శ్రీకాంత్, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, లెక్కల వేణుగోపాల్ ,మాజీ జెడ్పిటిసి ఇప్పలపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ ఆరకాల వీరేశలింగం, గడ్డం వెంకటేశం, జిల్లా నాయకులు ది కొండ లక్ష్మీనారాయణ, ఓడ్నాల రవీందర్, జక్కని ప్రభాకర్, స్వర్గం నరసయ్య, వేముల చంద్రశేఖర్, ఎల్ల మహేష్, నర్సప్ప వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
- Home
- పద్మశాలిలలో రాజకీయ చైతన్యం రావాలి….రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. -స్వర్గీయ మచ్చ ప్రభాకర్ సేవలు మరువలేనివి. -తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి