మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణానికి చెందిన ప్రజాకవి, రచయిత, సామాజికవేత్త, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ నాగుల సత్యంగౌడ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా రూపొందించిన కవితా సంకలనం, పోలీసు అమరవీరులు పోషించిన పాత్ర, తరతరాలకు తరగని చరిత్ర అనే కవిత సంకనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కార్యాలయ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, ఇందుకు ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో మెదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచం లాంటివారని అందుకే ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహించి, ప్రజలతో మమేకమయి, ప్రజల రక్షణ కొరకు అహర్నిశలు శ్రమిస్తు, శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల పాత్ర సమాజంలో అతి కీలకమైంది అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరిస్తూ నిజాయితీగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భవాన్ని లవర్చుకొని సమాజసేవలో భాగస్వాములై, నవభారత నిర్మాణానికి పునాదిగా నిలవాలని సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ విలువైన పౌరులుగా ఎదిగినప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అంటరాని స్వార్ధాన్ని వదులుకున్నప్పుడే మహాత్ములు, మహనీయులు ఔతారు అన్నారు. అనంతరం ఆవిష్కరించిన పోలీస్ అమరవీరుల కవిత సారాన్ని, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి సత్యం గౌడ్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వోడ్నల రాములు, మార్క్ అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Home
- సత్యంగౌడ్ కవిత సంకలనాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..