మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మాటూరి తరుణ్ ను ముందుగా ఊహించినట్లుగానే వేలేరు పోలీసులు శనివారం అరెస్టు చూపించారు. హుజురాబాద్ కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు కేవలం ఒక్కరినే అరెస్టు చేసినట్లు చూపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒకేసారి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేవలం ఒకరిని అరెస్టు చేశారా? లేదా ఇద్దరిని అరెస్టు చేశారా అనేది స్పష్టత లేకపోవడంతో స్థానికులు కొందరు అయోమయానికి గురవుతున్నారు. పట్టణంలో రెండు రోజులుగా ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి వచ్చి వేలేరు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసుల మంటూ వారి కుటుంబ సభ్యులకు తెలిపి తీసుకుపోయిన విషయం విధితమే! కానీ వేలేరు పోలీస్ స్టేషన్లో ఈరోజు స్థానిక ఎస్సై పాత్రికేయులకు ఒక వ్యక్తిని మాత్రమే అరెస్టు చేసినట్లు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. స్థానిక పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి వేలేరు బస్టాండ్ లో తనిఖీలు నిర్వహించగా హుజురాబాద్ కు చెందిన మాటూరి తరుణ్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి 410 గ్రాములు దాని విలువ డబ్బులు రూ. 8900, ఒక సెల్ ఫోన్ అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. కానీ హుజురాబాద్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చర్చిస్తుండగా వేలేరు పోలీసులు మాత్రం ఒక వ్యక్తిని మాత్రమే గంజాయిని సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలుపడంతో పలు అనుమానాలు వస్తున్నవి. మరి రంగనాయకుల గుట్టకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని ఎవరు తీసుకుపోయారని కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు వెంకటేష్ అనే వ్యక్తి ఎవరి అదుపులో ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనాప్పటికీ స్వర్ణోదయంలో వచ్చిన ‘పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు’ అని వచ్చిన వార్త ఒకరి అరెస్టుతో నిజమని రుజువైంది.