
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటు పడాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు, వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ మహ్మద్ ఆజమ్ తేలిపారు. సోమవారం నాడు స్థానిక హుజూరాబాద్ రంగాపూర్ గ్రామంలో హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అతిగా సెల్ వాడవద్దు అని, చెడు స్నేహానికి దూరంగా ఉండాలి అని, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని సాధించే దిశగా ప్రతినిత్యం కృషి చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పేదరికం చదువుకు అడ్డు కాదని ఉన్న అవకాశాలు వినియోగించుకొని అందనంత ఎత్తుకు ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుండాలన్నారు. హిల్ టాప్ సంస్థ డైరెక్టర్ తౌటం సునీల్ మాట్లాడుతు నిజాయితీ, పట్టుదలతో చేసే ఏ పని అయినా ఉత్తమ ఫలితం ఇస్తుందని, ఎన్ని అవరోదాలు ఎదురైనా విజయం కోసం ప్రయత్నం చేస్తుండటమే విద్యార్థులకు గొప్ప విజయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని మంచి విషయాలు తెలిపిన ఆజమ్ కి ధన్యవాదాలు తెలిపారు.









