
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణ ప్రజలకు ఇచ్చిన మాట హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ నిలబెట్టుకున్నారు. ఇటీవల హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రజల వాకర్స్ కోరిక మేరకు వాకర్స్ తో కలిసి మైదానాన్ని ప్రణవ్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు వాకింగ్ ట్రాక్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాలని, మైదానానికి గేటు లేకపోవడం వల్ల ఇతర వాహనాలు లోపలికి వస్తున్నాయని దాంతో వాకర్లు, ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా వీటన్నిటిని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించగా ప్రజల, వాకర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రణవ్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లగా, ప్రభుత్వం పది లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఏడు లక్షలతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు మూడు లక్షలతో గేటు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రణవ్ తెలిపారు. ప్రజల, వాకర్స్ సమస్యలు తీర్చినందుకు, వాకర్స్, పట్టణ ప్రజలు వోడితల ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు.








