
–పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే రాజకీయాల్లోకి..
–సేవ చేయడం కోసం వచ్చాను ఒకసారి ఆశీర్వదించండి
–జగిత్యాల, కోరుట్లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని అలాగే ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ అధ్యాపకుల సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాల, కోరుట్ల పట్టణాల్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు, హై స్కూల్లలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఉర్దూ, ఇంగ్లీష్ మీడియలకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులను నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లను వేసి గెలిపించాలని కోట్లు అభ్యర్థించారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం, వారికి విస్తృతంగా సేవలు అందించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సంపాదించడానికి కాదు సేవ చేయడానికే ఎమ్మేల్సి అభ్యర్థిగా బరిలో ఉన్నానని అన్నారు. నిరుద్యోగులు పట్టుభద్రుల పక్షాన శాసనమండలిలో గళం వినిపించడానికి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత భవిష్యత్తును అందించమన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు పట్టభద్రులకు అండగా ఉండడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నిరుద్యోగులు పట్టుభద్రుల సమస్యల పట్ల శాసనమండలిలో ఇంతవరకు సమగ్రమైన చర్చ జరగలేదని, వారి సమస్యలపట్ల అవగాహన ఉన్న నేను వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎంతొ మందికి సహాయం చేస్తు తొడుగా ఉంటూ ముందుకు వెళుతున్నానని, ఆస్తులను కాపాడుకోవడానికి, సంపాదించుకొవడం కొసం రావడం లేదని సేవ చేయడానికే మాత్రమే వస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యంలొ జాబ్ క్యాలేడంర్ విడుదల చేశారని గుర్తు చేశారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు, ఇదివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు కూడా ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఏవైనా సవరణలు ఉంటే సరిదిద్దుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు, పట్టుభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతంగా ముగించిన అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.. అతి తక్కువ సమయంలో నిరంతరం శ్రమిస్తూ ఓటరు నమోదులో చురుకుగా పాల్గొని 1 లక్ష 23 వేల సభ్యత్వం కు కృషిచేసిన TEAM VNR సభ్యులను అభినందించారు..











