మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయ అధికారి పేరు మరియు ఫోన్ నెంబర్ల్, పనిచేసే సిబ్బంది వివరాలు సమాచారం ఉండకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి కారణమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ గురువారం ఆరోపించారు. హుజురాబాద్ మండల కేంద్రంలో డివిజన్ కేంద్రమైనటువంటి హుజురాబాద్ పంచాయతి రాజ్ డివిజన్ ఆఫీసులో(DE) ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి ఫోన్ నెంబర్ చెప్పకపోవడం చాలా దురదృష్టకరం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ ఆరోపించారు.
హుజురాబాద్ డివిజన్ కేంద్రమైనటువంటి హుజురాబాద్ మండల కేంద్రంలో వివిధ మండల కార్యాలయాల్లో, ఆ కార్యాలయంలో పనిచేసే అధికారుల హోదా పేర్లు మరియు ఫోన్ నెంబర్లు ప్రజలకు, వివిధ సమస్యలపై వచ్చే, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులకు, సమాచారం నిమిత్తం, కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కార్యాలయాలలోకి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడున్నటువంటి సిబ్బందిని సమాచారం అడుగుతే, సార్లు మాకు నెంబర్లు ఇవ్వలేదు అని సమాచారం ఇస్తున్నారన్నారు. అధికారులు డ్యూటీలకు వచ్చి ఆయా సంబంధిత కార్యాలయంలో రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లకుండా, సైట్ల మీదికి వెళ్లారని చెప్పడం, అధికారి ఫోన్ నెంబర్లను గోప్యాంగ్ ఉంచడం ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రజలు వివిధ రూపాలలో చెల్లించే పన్నులతో ఈ ప్రభుత్వ అధికారులకు వేతనాలు పొందుతున్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయం అంటేనే ప్రజలకు సేవలు అందించే కార్యాలయంలో వారి ఫోన్ నెంబర్లు, పేర్లు హోదా తెలియ పరుచుకోకుంటే వారు ఎవరి కోసం పని చేస్తున్నారని, ఆయన ప్రశ్నించారు?. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకొని సమాచారం ఏర్పాటు చేయకపోతే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, కదిరె రమేష్, కొంకట చంద్రయ్య, దాట్ల రత్నాకర్ లు పాల్గొన్నారు.