
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్వర్ణకారుల జీవితాలకు(జీవనోపాధికి విఘాతం కలిగించే) దెబ్బ ఉండే వ్యాపార సంస్థలకు అనుమతులు ఇవ్వరాదని కోరుతూ శుక్రవారం హుజురాబాద్ తాసిల్దార్ కే కనుకయ్యకు స్వర్ణకారులు వినతి పత్రం అందజేశారు. కొంతమంది బడా వ్యాపారవేత్తలు స్వర్ణకారుల కుటుంబాల పోట్టగొట్టేందుకు రకరకాల పేర్లతో దుకాణాలు ప్రారంభిస్తున్నారని, అసలే గిరాకీలు లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇలాంటి దుకాణాలు వస్తే పూర్తిగా తిప్పలు తప్పవని అన్నారు. మున్సిపల్ అధికారులు గానీ రెవెన్యూ అధికారులు కానీ ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వరాదని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం నాయకులు మునిగంటి వెంకటేశ్వర్లు, బోజ్జా వేణు, కాసుల కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






