Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోనే ఎంతో సీనియర్ స్టాంప్ వెండర్ అయినా మరాఠీ పుల్లేశ్వర్ సా(65) ఈ రోజు వారీ స్వగృహంలో ఉదయం పరమపదించారు. హుజురాబాద్ పట్టణంలోనే అత్యంత సీనియర్ స్టాంప్ వెండర్ గా అందరితో కలువిడిగా నడుచుకునేవారు. అలాంటి ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూనే మృతి చెందడంతో పలువురు న్యాయవాదులు, పలువురు స్టాంపు వెండర్లు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.






