
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ క్రీడల్లో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ఇందిరాదేవి తెలిపారు. హుజూరాబాద్ లో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న నల్లగొండ రష్మిత అనే విద్యార్థిని 10 కిలోమీటర్ల ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ ఈవెంట్లో శాతవాహన యూనివర్సిటీ తరపున పాల్గొని విజయాన్ని సాధించిందన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం స్థాయిలో ఛాంపియన్ గా నిలిచిన రశ్మిత, మంగళూరు యూనివర్సిటీ, కర్ణాటకలో నిన్నటి రోజు జరిగిన ఈ క్రీడా పోటీల్లో శాతవాహన విశ్వవిద్యాలయం తరపున ప్రాతినిధ్యం వహించి పాల్గొన్నట్టు, కళాశాల క్రీడా సమన్వయకర్త మంగమ్మ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు కళాశాలలో ఈ క్రీడాకారిణిని కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, అకాడమిక్ సమన్వయకర్త లింగారెడ్డి, ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ రేణుక, అధ్యాపకులు డాక్టర్ మైపాల్ రెడ్డి డాక్టర్ ఓదెలు, డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ సుమలత, డాక్టర్ స్వరూపరాణి, రమ, పల్లవి, స్వప్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
