Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో మంగళవారం మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఏసుక్రీస్తు ప్రజలకు చెప్పిన మాటలను ఆయన చూపిన మార్గాన్ని రెవరెండ్ జాన్ బాబు వివరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సొల్లు బాబు, కోశాధికారి అమర్లపూడి ప్రియాంక చరణ్, రవీందర్, సొల్లు మహేందర్, స్రవంతి, హిమవంతు, సొల్లు సునీత, యేముల పుష్పలత, దుబాసి రాణి, కూకట్ల సబిత, తిప్పారపు లలిత, కండే శంకర్, రజిత, జయంతి, బ్లెస్సీ, శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.








