
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని (CEIR portal) ఉపయోగించి సుమారు 50 ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్ లో ముఖ్యమైన డాటా ను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు కనిపెట్టి అందించడం అభినందనీయమని అన్నారు. పోలీసులు తమకు ఫోన్లు తిరిగి ఇప్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. సెల్ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐలు టీ తిరుమల్ గౌడ్, పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐలు వరగంటి రవి, కిషోర్, ఎస్సైలు తోట తిరుపతి, ఎన్ రాజకుమార్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.









