మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, క్లాస్ బాయ్, క్లాస్ గర్ల్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఎన్నికలు చాలా ముఖ్యమని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి అర్హులని, మన ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకొని, గ్రామం నుంచి మొదలుపెడితే రాష్ట్రం, దేశం దాకా అభివృద్ధి చెందడంలో మన ఓటు చాలా కీలకమని తెలియజేశారు. అలాగే ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మన ఓటును తప్పకుండా వినియోగించు కోవాలని, మన ఓటుతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించొచ్చని, ఎలాంటి వాటికి లొంగకుండా మన ఓటునీ వేయాలని తెలిపారు. ఆనంతరం జరిగిన కార్యక్రమంలో ఎన్నికైన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.