మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలురలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్(రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి సమ్మిరెడ్డి చేతులమీదుగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరముల నుండి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు, సమాజంలోని పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అమూల్యమని అన్నారు. ఈ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు అందించి మంచి గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అనురాధ, విజయలక్ష్మి, రాధారాణి, శ్రీ భవాని, సుచిత్ర, స్వర్ణలత, సంపత్ విద్యార్థులు పాల్గొన్నారు.