
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో సోమవారం మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన జయన్న ఫౌండేషన్, హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంకు చక్కని స్పందన లభించిందని జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చుక్కల మందులు అందించినట్లు ఆయన తెలిపారు. కాగా వీరిలో 55 మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా వారిని బస్సులో హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి శస్త్ర చికిత్స నిమిత్తం తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగాపూర్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరిత, కాట్రపల్లి మాజీ సర్పంచ్ కాసగోని నిరోషా, చల్లూరి సమ్మయ్య, పెరుమాండ్ల శివ, ఇమ్మడి దయాకర్, వేల్పుల రత్నం తదితరులు పాల్గొన్నారు.


