
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఒకవైపు శీతాకాల సమావేశాలు ఉన్నప్పటికీ జల్సాల కోసమే జైపూర్ వెళ్లారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల వాయిదా పై తన నివాసంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని పక్కన పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చినప్పటికీ అసెంబ్లీ వాయిదా వేయడం సిగ్గుచేటు అన్నారు.
