
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 10: ఇటీవల వరంగల్ లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను తెలంగాణ అల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో మంగళవారం పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ ఘనంగా సన్మానించారు. విద్యార్ధులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సీఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాటే శిక్షణ ద్వారా దేహ దారుఢ్యాన్ని పొందడమే కాక మానసికంగా ధృడంగా తయారవుతారని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలలో ఆత్మస్థెర్యాన్ని, మనోధైర్యాన్ని పెంపొందించి సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా తయారు చేయవచ్చన్నారు. కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్, ఎస్సై యూనస్ అలీ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఖాలిద్ హుస్సేన్, మైనార్టీ నాయకులు మహ్మద్ అలీమ్, ఉప్పు శ్రీనివాస్, గోస్కుల మధు, అంబాల ప్రభాకర్, తులసీ లక్ష్మణమూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

