
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని ముస్లింలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు కరీంనగర్ ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రణవ్ బాబు చొరవ తీసుకొని హుజురాబాద్ ముస్లిం షాదీఖానాకు 50 లక్షలు నిధులను వెంటనే మంజూరు చేయాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబ్రస్థాన్ మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ధర్మారం పట్టణంలోని ఉన్న మస్జిద్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు రెండు లక్షల రూపాయలు, ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామంలో ఉన్న మసీదు ప్రహరీ గోడ తోపాటు గేటు కొరకు రెండు లక్షల 50 వేల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయాలని, హుజురాబాద్ నియోజకవర్గం లోని ఉన్న ముస్లింల ఖబ్రస్థాన్ ల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు కూడా నిధులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం షాదీఖానా భవన నిర్మాణంతో పాటు చుట్టూ ప్రహరీ గోడ, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ముస్లిం షాదిఖానా భూమి సమానంగా లేనందున అందులో మట్టిని వేయించి జెసిబి తో సమానంగా సైదాపూర్ రోడ్డు ఎత్తు సమానంగా చేయవలసిన అవసరం ఉంది కనుక దానికి వెంటనే ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయాలని, దీనితో పాటు ముస్లిం షాదిఖానాలో విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, కరెంట్ వైరింగ్, సెంట్రల్ లైటింగ్ ఇలాంటి మర్మతుల కొరకు కూడా 25 లక్షలు వెంటనే మంజూరు చేయించాలని అన్నారు. అలాగే జమ్మికుంట మండలం విలాసాగర్ పట్టణంలో 2 ఎకరాల స్థలం సర్వే నెంబర్ 349 లో దర్గాతో పాటు ముస్లిం ఖబ్రస్థాన్ అని, 1996 సంవత్సరం పహాని లో ఉంది కానీ ఇప్పుడు ధరణిలో ప్రభుత్వ భూమి అని నమోదు చేశారని అన్నారు. వెంటనే ప్రభుత్వ భూమి నమోదు చేసిన దానిని వెంటనే మార్పిడి చేసి ముస్లిం ఖబ్రస్తాన్ ధరణిలో మార్పిడి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మొహమ్మద్ జాకీర్, మహమ్మద్ అక్బర్ తో పాటు వివిధ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.






