Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: డిసెంబర్15: హైయ్యర్ పెన్షన్ను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో సమావేశం రిటైర్డ్ కార్మికులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. హైయ్యర్ పెన్షన్ పట్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారని, అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు అందడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ చారి, సంపత్ కుమార్, టీ కనకయ్య, పాండారి, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, నర్సయ్య, ప్రభాకర్ రెడ్డి, మొగులయ్య, వైకే స్వామి, తదితరులున్నారు.






