
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ రిజర్వేషన్ అడ్డుకునే మాలలను బహిష్కరిస్తామని మాదిగల ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరియు మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మాదిగల తక్షణ కర్తవ్యం అనే అంశం పైన ఈరోజు మాదిగల ఐక్య వేదిక వేదిక ద్వారా హుజురాబాద్ లోని మధువని గార్డెన్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాదిగ జాతికి ఏం కావాలో ఏం అన్యాయం జరుగుతుందో అని మాదిగ జాతి సోదరులు విశ్లేషణ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సభ ద్వారా అందాల్సిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనీ అందరూ ఆకాంక్షించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మూడు ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. (1) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వివేక్,కెఆర్ నాగరాజు మరియు రేంజర్ల రాజేష్ లను దలిత సమాజం మరియు మాదిగ సమాజం నుండి బహిష్కరణ
(2)మాలలు యస్సి రిజర్వేషన్ పై వైఖరి మార్చుకోకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మాదిగలను ఓట్లు అడగకూడదు మీమ్మల్ని మా మాదిగలు ఓట్లు అడగరు.
(3)మాదిగలు ఏం పార్టీ లో ఉన్న పార్టీలకు అతీతంగా గెలిపించాలి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సభ నిర్వాహకులు తిప్పారపు సంపత్, సభాధ్యక్షులు రుద్రారపు రాంచందర్, మారపెల్లి శ్రీనివాస్ మాదిగ, మహిళా విభాగం నేత ఆకినపెల్లి శీరీష, మిడిదొడ్డి శ్రీనివాస్, కొండ్ర నరేష్, మొలుగూరి పూర్ణచందర్, పర్లపెల్లి రమేష్, మిడిదొడ్డి రాజు, ఏర్ర రవీందర్, ఏర్ర రమేశ్ ,బోరగాల రాజయ్య, సతీష్, మోరె మధు, టేకుల శ్రావణ్ ,కొలుగూరి కిరణ్, మోలుగూరి ప్రభాకర్, వేల్పుల రత్నం, బొడ్డు సంజీవ్, వేల్పుల విజయ్, ఏర్ర నాగరాజు, అడ్వకేట్ మొలుగూరి సదయ్య, తునికి సమ్మయ్య, మిడిదోడ్డి స్వామి, మునిగాల మధు, మేకల రవీందర్, రవీతేజ, ఎర్ర శ్రీధర్, ఆరపెల్లి ఎల్లయ్య, లంకదాసరి కళ్యాణ్, శనిగరపు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు



l





