
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిండు నూరేళ్లు జన్మించాలని ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవలు అందించాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నారు. ముందుగా ఆలయం బయట జన్మదిన కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం లాంగ్ లైవ్ కౌశిక్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పార్టీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, నాయకులు కృష్ణమూర్తి, పి లింగారెడ్డి, విగ్నేష్, వర్షిని, మేఘన, దీపిక, రాధిక తదితరులు పాల్గొన్నారు.









