
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి(కాక) పదవ వర్ధంతి హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. కాక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాక తెలంగాణ కొరకు అహర్నిశలు కృషి చేశాడని, సోనియాగాంధీని ఒప్పించడంలో వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. తీవ్ర సలిలో కూడా కాక తెలంగాణ తీసుకరావడంలో తనవంతు కృషి చేశారని పలువురు వార్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొల్లు బాబు అలాగే సీనియర్ నాయకులు కొలిపాక సారయ్య, సొల్లు దశరథం, అప్పాల రఘుపతి, సొల్లు మహేందర్, గడ్డం దయాకర్, సొల్లు రమేష్, కొత్తూరి జీవన్, దాట్ల ప్రభాకర్, చౌదరి, స్వామి, సొల్లు సునీత తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ మరియు కాకా కుమారులు గడ్డం వివేక వెంకట్ స్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, మాజీ మంత్రి శంకర్రావు మరియు కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు, స్టాప్, అభిమానులతో పాటు హుజురాబాద్ కు చెందిన పాక సతీష్, తోగరు బుచ్చన్న, దొంత చంద్రయ్య పాల్గొన్నారు.

