
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని పీవీ సేవా సమితి హుజురాబాద్ వారు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద పీవీ చిత్ర పటానికి పీవీ సేవా సమితి, సిద్దార్థనగర్ కాలనీ అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, సాగి వీరభద్రరావులు పూల మాల వేశారు. పీవి అభిమానులు కొవ్వత్తులు వెలిగించి, హుజురాబాద్ ను పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారికి భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీవీ ఈ దేశానికి అందించిన అత్యుత్తమ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి, సిద్దార్థనగర్ కాలనీ అధ్యక్షుడు సాగి వీరభద్రరావు, తూము వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల మనోజ్, వైద్యులు రామలింగారెడ్డి, తొగరు విద్యాసాగర్, పీడీ కే రాజిరెడ్డి, సీడ్స్ సంపత్ రావు, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, వేల్పుల రత్నం, పంజాల సుధాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు కాసర్ల శ్రీహరి, కర్నేకంటి సదానందం, ముక్కేర కన్నయ్య, రావుల తిరుపతిరెడ్డి, అంబరీష్,
నమశ్శివాయ, చంద్రశేఖర్, పసుల స్వామి, తనుగుల వినోద్ తదితరుల పాల్గొన్నారు.

