
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రిస్మస్ పండగలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఉదారతతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు శాతవాహన యూనివర్సిటీ JAC వ్యవస్థాపక చైర్మన్ చెనమల్ల చైతన్య తెలిపారు. ఈ శీతాకాలంలో దుప్పట్లు కూడా కొనుక్కోని, ఆరోగ్యాన్ని కాపాడుకోలేని దారిద్య రేఖకి అతి దగ్గర ఉన్న కుటుంబాలకు ఈ దుప్పట్లు ఇస్తున్నామని చెప్పారు. రవీందర్ సింగ్ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పాటుపడుతూ వారి యొక్క కష్టాలని కడతేర్చే విధంగా ఎన్నో వేల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయూతనందిస్తూన్నారని అన్నారు. అందులో భాగంగానే క్రిస్మస్ పండగలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పట్లు తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబం సర్దార్ రవీందర్ సింగ్ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని దుప్పట్లు తీసుకున్న కుటుంబాలు రవీందర్ సింగ్ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో TJVP రాష్ట్ర కోర్డినేటర్ బండ అశోక్, హుజురాబాద్ వైస్ MPP బండి రమేష్, కొరగాని సునీల్ బాబు, పాస్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

