
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావును తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ బుధవారం నూతన సంవత్సరం పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా తెలంగాణ భవన్లో కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ ముందుకు సాగాలని, వచ్చే ఐదేళ్లలో అధికారం చేజికించుకోవాలని కోరుతూ.. ఆ దీశగా యూత్ ఫోర్సు కృషి చేస్తుందని అర్జున్ తెలిపారు.







