
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నిరుద్యోగ యువతులకు మరియు గృహిణులకు
హుజురాబాద్ పరిసర ప్రాంతాల మహిళాలకు అతివ ఉమెన్ ఆర్గనైజేషన్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ, యూనిఫామ్ స్టిచ్చింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ, అప్పడాలు, పచ్చళ్ళు తయారీ వంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలపై శిక్షణ ఇవ్వబడునని నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ట్రైనింగ్ సర్టిఫికెట్ మా సంస్థ ద్వారా అందించబడునని తెలిపారు. మీరు శిక్షణ పొందిన విభాగాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా అందించు మహిళా ఆర్థికాభివృద్ధి పథకాలలో ప్రధాన్యత కల్పించబడునన్నారు. శిక్షణ కేంద్రం జమ్మికుంట రోడ్డు S.R హాస్పటల్ ప్రక్కన భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా ప్రారంభించబడునని, ఆసక్తి కలవారు ఈ క్రింది సెల్ నంబర్లను 9989602860, 8639388442లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
