
Oplus_131072
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: వీణవంక మండలం చల్లూరు గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. పేకాడుతూ పట్టుబడిన వారిలో బొంగోని రాజు, గంజి నరేష్, బొంగోని రజినీకాంత్, పల్లెపు సదయ్య, చింతకింది భార్గవ్, గంజి శివాజీ, శివరాత్రి తిరుపతి, కొంచెం సతీష్ లను పట్టుకొని వారి వద్ద నుండి పేకలను రూ .15,600 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆనంతరం వారిని వీణవంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
