
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు(28) అనే యువకుడు ఆన్ లైన్ గేమ్స్ తో మోసపోయి దాదాపు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన రాజు ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రులతో ఆన్లైన్ గేమ్ ఆడడం ప్రారంభించి చివరికి అప్పులపలై అవి తీర్చే దారి తెలియక అప్పుల వారి బాధ భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలచివేసింది. ఇప్పటికైనా యువతీ యువకులు ఆన్లైన్ గేమ్స్ కు ఆకర్షితులై కాకుండా.. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని పోలీసులు తెలుపుతున్నారు.
