
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమలోని చేనేత పారిశ్రామికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి చేనేత అభయ హస్తంలో భాగంగా ‘నేతన్న పొదుపు’ త్రిప్టుఫండ్ పథకం, ‘నేతన్న భద్రత, వయస్సుతో నిమిత్తం లేకుండా బీమా మరియు ఎక్స్గ్రేషియా పథకం మరియు ‘నేతన్న భరోసా’ నేత పారిశ్రామికునికి అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూర్చే పథకాలు తేదీ:1-2- 2025 నుండి అమలు చేయుటకు నిర్ణయించిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, స్థానిక రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల చిత్రపటానికి హుజురాబాద్ చేనేత సంఘం ఆవరణలో సంఘ కార్యవర్గ సభ్యులు మరియు నేత పారిశ్రామికులు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేనేత కార్మికులు ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు ఎలిగేటి ఉపేందర్ పర్సన్ ఇంచార్జి, వేముల యాదగిరి, గుండేటి మహాదేవ్, మంచికట్ల వెంకటయ్య, మండల సత్యనారాయణ, కుడికాల ప్రభాకర్, మంచికట్ల సుమలత, మంచి కట్ల వాణి పర్సన్ ఇన్చార్జిలు మరియు సంఘ నేత పారిశ్రామికులు, బాపూజీ నేత పారిశ్రామికులు, సంఘ సిబ్బంది పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

