
Oplus_131072
కుమార్ యాదవ్, స్వర్ణోదయం జమ్మికుంట రిపోర్టర్: బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో చేర్పించగా బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు ఆకుల రాజేందర్ తల్లికి శనివారం గుండెపోటు రాగ కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్న ఆమెని బండి సందర్శించి, పరామర్శించారు. చలి తీవ్రంగా ఉన్నందున హార్ట్ ఎటాక్ తరచుగా వస్తాయని వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సంజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కరీంనగర్ పార్లమెంటు బోయినపల్లి ప్రవీణ్ రావు, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలగాని రాజు, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు దొంతరవేణ రమేష్ యాదవ్, నాయకులు పొన్నగంటి రవి, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, బొజ్జ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
