
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పుల్ల ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన పుల్ల శోభన్ కుమార్ కి ఘన సన్మానం హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల శోభన్ కుమార్ ఇటీవల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన సందర్భంగా పుల్ల ఫ్యామిలీస్ వారు ఏర్పాటు చేసిన సన్మానం సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు పుల్ల వంశస్థులు మాట్లాడుతూ పుల్ల శోభన్ కుమార్ యువతకు ఆదర్శమని, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా ఎదిగిన తీరును గుర్తుచేశారు. ఆయన పట్టుదల కృషి చూసి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీత సూపరింటెండెంట్ఆఫ్ పోలీస్ పుల్ల శోభన్ కుమార్ మాట్లాడుతూ తనకు పుల్ల ఫ్యామిలీస్ వారు సన్మానం చేయడం పట్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు నష్టాలు అవమానాలు ప్రశంసలు అనుభవించానని కానీ వేటికి తలవాంఛ కుండా అన్నింటిని అధిగమిస్తూ క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వారిలో ఒకరికొకరు భేదాభిప్రాయాలు కలగజేసుకొని భవిష్యత్తులో ఎదగకుండా ఒకరికి ఒకరు అడ్డుపడుతు ఇద్దరు నష్టపోతున్నారని అన్నారు. నేటి సమాజంలో ఇతర సామాజికవర్గాలకు చెందిన ప్రజలు ప్రపంచంతో పోటీ పడి ముందుకెళుతున్నారని, కొందరు మాత్రం వాడలలో గ్రామాలలో సమస్యలు సృష్టించుకుని వారి భవిష్యత్తుకు ఎటువంటి ఉపయోగం లేని అనవసరమైన పంచాయితీలు పెట్టుకొని అక్కడే ఆగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోలీస్ సర్వీసులో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ లాంటి నేరపూరిత వ్యవహారాలలో బలహీనవర్గాలకు చెందిన యువత బలి కావడం తనను బాధించాయని అన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత ఉద్యోగ వేటలో పడుతున్నారని, ఉద్యో గంతో పాటు వ్యాపార రంగంలోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వాడల్లో గ్రామంలో ప్రజలు తగాదాలు పెట్టుకొని మన అభివృద్ధికి మనమే అడ్డుపడద్దని, ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికిఎదగాలని సూచించారు. యువత ప్రపంచంతో పోటీపడే విధంగా తయారవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్ల శ్రీనివాస్, ప్రముఖ గాయకులు పుల్ల శ్రావణ్ కుమార్, పుల్ల వెంకన్న, పుల్ల సాంబయ్య, రాధా, డాక్టర్ పుల్ల కుమారస్వామి, సంతోష, పుల్ల పవన్ కుమార్, ఏసు బిక్షపతి, రమేష్, సృజన్, ఆశిష్, అభిలాష్ తదితర చెల్పూర్ పుల్ల వంశస్థులు పాల్గొన్నారు.

