
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, జనవరి 18:
సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్(23) ప్రాణాలు కోల్పోయాడు. అమన్ జైస్వాన్ ప్రమాద వార్తను రచయిత ధీరజ్ మిశ్రా ధ్రువీకరించారు. ఓ సీరియల్ ఆడిషన్ కోసం వెళ్లిన అమన్ తిరిగి వస్తున్న సమయంలో ముంబైలోని జోగేశ్వరి హైవేపై అతను ప్రయాణి స్తున్న బైక్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో అమన్ అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు.
అమన్ జైస్వాల్ ధర్తిపుత్ర నందిని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నివాసి అయిన..అమన్ జైస్వాల్ టీవీ షోల ద్వారా తనదైన ముద్ర వేశారు. అతను జనవరి 2021 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రసారమైన ‘ధర్తిపుత్ర నందిని’లో ఆకాష్ భరద్వాజ్, సోనీ TV ‘పుణ్యశ్లోక్ అహల్యాబాయి’లో యశ్వంత్ రావ్ ఫాన్సే పాత్రను పోషించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నటుడు అమన్ కు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడి కైనా బైక్ పైనే వెళ్లేవాడట. ఇన్ స్టాగ్రామ్ లో కూడా చాలా వీడియోలు బైక్ రైడింగ్ ఉన్నాయి. నటుడే కాదు మంచి గాయకుడు కూడా. అమన్ అకాల మరణంపై బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
