
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాట్రపల్లి గ్రామంలో నివసించే అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు, అలాగే గ్రామంలో ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, ఏమీ లేని ఇల్లు కిరాయికి ఉండే నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించి గాని లేదా ఖాళీ ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కాట్రపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాసగోని నిరోషా కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఇంటి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించిందని, దీనితో కొంతమంది ఇంటి ఖాలీ స్థలం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోగా ఇంటి ఖాళీ స్థలం లేని వారు దరఖాస్తు చేసుకోలేదన్నారు. దీనితో ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసే అధికారులు సర్వే చేయలేదు కావున సర్వే చేయని నిరుపేదల ఇండ్లలో సర్వే చేయలేదని, ఇంటి ఖాళి స్థలం లేని నిరుపేదలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. కాబట్టి ఖాళి స్థలంలేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, అదేవిధంగా రేషన్ కార్డుల్లో పిల్లలను జత చేయాలని, అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన వారికి కూడా వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేసి భార్య భర్తల ఇద్దరినీ కలిపి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ఉన్నత అధికారులను, ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
