
–బీసీల అడ్డగా అన్న హుజురాబాద్ గడ్డలో దొరల పాలన కులుస్తాం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, జనవరి 22: బీసీల ఐక్యతతో హక్కుల సాధన కోసం పోరాడుతామని, నిర్విరామ పోరాటంతో రాజ్యాధికారాన్ని సాధిస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు.
ఖిలాశాపూర్ నుంచి మొదలైన బీసీల సైకిల్ యాత్ర బుధవారం రోజు హుజురాబాద్ కు చేరింది. హుజురాబాద్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు. జనాభాలో దాదాపు సగా భాగమైన బీసీలాము అన్ని రంగాలలో వెనకబడి ఉన్నామని, పన్నులు కట్టి దేశాన్ని నడిపే బీసీలము అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామన్నారు. యాచించే స్థాయి నుంచి పాలించే స్థాయికి రావాలని, ఆ పాలన కోసం బీసీలను చట్ట సభల్లో కూచోబెట్టి ఈ దేశాన్ని పాలించినపుడే దేశ స్థితి గతులు మారతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సైకిల్ యాత్ర సాధకులు బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్ గాడ్గే, కొంగర నరహరి మాల, పర్వత సతీష్, విజయ్ కుమార్ మాదిగ, మోహన్ రెడ్డి, చంద్రయ్య మాదిగ, మూర్తి, వెంకటేష్, సుధాకర్, జహంగీర్, జయ్ తదితరులు పాల్గొన్నారు.

