
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్, జనవరి 29: హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ఆదామా వెస్టిసైడ్స్, నిర్మాణ్ ఎన్జీవో సంస్థ వారు నాలుగు లక్షల రూపాయల విలువైన వస్తు సామాగ్రిని అందించి, ఉదారత చాటుకున్నారు. విద్యార్థులు కూర్చోవడానికి 40 డ్యుయల్ డెస్క్ బెంచీలు, స్మార్ట్ క్లాస్ ప్యానెల్ టీవీ, ప్రింటర్‌ను, 5 ఎస్ టైప్ కుర్చీలను బుధవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదామా కంపెనీ వారు అందించిన స్మార్ట్ క్లాస్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేశి, మెరుగైన విద్యను అందిస్తామని తెలిపారు. అలాగే, కుర్చీలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల శ్రేయస్సుకు పాటుపడుతున్న ఆదామా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అదామా కంపెనీ ప్రతినిధి సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్ పావు నాయుడు గారు మాట్లాడుతూ.. తమ సంస్థ రైతుల శ్రేయస్పే కాకుండా. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన విద్యను స్మార్ట్ క్లాసెస్ ద్వారా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి సంపత్, పాఠశాల ఏఏపీసీ చైర్మన్ గంగా, పీఎన్హెచ్ఎమ్ రజిని, ఏఈవో సతీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఆదామా కంపెనీ ప్రతినిధి ప్రకాష్, తూముల చక్రధర్ రావు, మనోహర్, పాఠశాల శాశ్వత దాతలు గసిరెడ్డి సదాశివ రెడ్డి, వంగల వెంకటరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు ఎడ్ల విజయ్ కుమార్, తక్కల్లపల్లి వెంకట్రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.







