
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు నిరుపేదకు బియ్యం వితరణ చేశారు. ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్(రిటైర్డ్ టీచర్) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన పట్టణానికి చెందిన పల్లెవేణి దాసుకు 25 కిలోల సన్న బియ్యం బ్యాగును అందజేశారు. పల్లవేని దాసు గనిశెట్టి లచ్చయ్య ఇంటి ప్రక్కన గల సంధిలో రేకుల రూములో కిరాయికి నివాసం ఉంటూ..గత ఆరు సంవత్సరముల నుండి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై దుర్భర జీవితము కొనసాగిస్తున్నాడు. ఈయనకు నెలకు రూ. 2000 వృద్ధాప్య పెన్షన్ మాత్రమే వస్తుందని ఈ పెన్షన్ ఆయన మందులకు సరిపోవడం లేదన్నారు. లేవలేని పరిస్థితిలో ఉన్న భర్తకు సేవలు చేస్తూ, పూట గడవడం కోసం భార్య శకుంతల ఇతర ఇండ్లలో మిగిలిన చలి అన్నము తెచ్చుకొని జీవనము గడుపుతున్నారన్నారు. వీరి పరిస్థితిని గమనించిన గంగిశెట్టి జగదీశ్వర్ 25 కిలోల బియ్యం బ్యాగును మరోసారి అందజేశారు. గతంలో రెండు మాసాలకు సరిపడు గాసము కూడా అందించడం జరిగినదని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారన్నారు. మన ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేసిన లిస్టులో తన పేరు లేదని దయచేసి రెండవ లిస్టులో తన పేరు చేర్చి ఆపదలో ఉన్న ఈ ముసలి జంటను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్, రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


నిరుపేదలకు బియ్యం వితరణ చేస్తున్న గంగిశెట్టి జగదీశ్వర్