
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని ZPHS ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రత గురించి ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గురించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాస రచన పోటీలో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన మొదటి, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంగ్లీష్ మీడియంలో మొదటి బహుమతి గెలుచుకున్న కౌసర్, ద్వితీయ బహుమతి ఎ సిందుశ్రీ, తృతీయ వి వర్షిత మరియు తెలుగు మీడియంలో మొదటి బహుమతి ఎం.వర్షిణి, ద్వితీయ బహుమతి ఆర్.లక్మిప్రియ, తృతీయ బహుమతి ఎస్ విద్వేష్ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత గురించి “అందరికి అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లి దండ్రులకు పేరు తీసుకురావాలని, ఇలాంటి పోటి పరీక్షలు మరిన్ని రాయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఈ నెల రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుడు సారయ్యని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదూరమ్మ ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్, విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనీరీలు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది సాయిచరణ్, ఐల్లయ్య మరియు ఉపాధ్యాయులు ZPHS HM బి తిరుమల, ఈశ్వర్ రెడ్డి, ఆసియా, శ్రీలత, మాధవిలత, శ్రీనివాస్, సదానందం, సంపత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

