
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు మాహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లోని గాంధీ విగ్రహానికి బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారన్నారు. ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, నాయకులు కట్ల రవీందర్, ఒడిజే చందర్ రావు, కందుకూరి భాస్కర్, ఇల్లందుల తిరుపతి, చిదురాల శ్రావణ్, కోలే సాయికుమార్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.







