
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వాసవి వనిత క్వీన్స్ క్లబ్ హుజూరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ మేధా హాస్పిటల్ హుజూరాబాద్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో క్లబ్ సభ్యులు అందరు పాల్గొని రక్తదానం శిబిరాన్ని విజయవంతం చేశారని క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ నార్ల అర్చన తెలిపారు. రక్త దానం ఒక మనిషి నిండు ప్రాణం అని, ఇలాంటి అవకాశాలు వస్తే ఎవరు వదులుకోకుండా సమాజ సేవలో ముందు ఉండి పాల్గొనాలని ప్రెసిడెంట్ అర్చన తేలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, బ్లడ్ డొనేషన్ ఇంచార్జ్ ముక్క శ్రీనివాస్ మరియు పవిత్రం శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ ఐత రమాదేవి, జోనల్ చైర్మన్ శైలజ,
ప్రెసిడెంట్ అర్చన, ట్రెజరర్ చికోటి త్రివేణి, సెక్రటరీ స్వప్న,
క్లబ్ సభ్యులందరు పాల్గొన్నారు.









