
టిటియు క్యాలెండర్ ను తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు తప్ప మరేరకమైన ఇతర బిల్లులు సంవత్సరం కావస్తున్నా క్లియర్ కావడం లేదని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ టీచర్స్ యూనియన్ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. జిపిఎఫ్, టిజిఎల్ఐ, సరెండర్ లీవ్,మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయనీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు వైద్య అవసరాలకు, గృహ నిర్మాణానికి, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇతరత్రా అవసరాలకు పొదుపు చేసుకునే జిపిఎఫ్, టిజి ఎల్ఐ నుండి లోన్లు తీసుకోవాలనుకున్నా నెలల తరబడి జాప్యం జరుగుతోందనీ, సరైన సమయంలో సొమ్ము అందక ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఇప్పటికైనా గత సంవత్సర కాలంగా పెండింగ్ లో వున్న అన్ని రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో ఆమోదించడం లేదనీ ఉద్యోగులు తమ చేతి నుంచి లక్షల రూపాయలు చెల్లించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కావున పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సర్వీస్ ప్రొటెక్షన్ కు సంబంధించి కోర్టులో వున్న కేసుకు పరిష్కారం చూపితే మ్యూచువల్ బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలతో పాటు 40% ఫిట్మెంట్ తో పిఆర్సి ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జి.సమ్మిరెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ లతో కలిసి సంయుక్తంగా వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొద్దుటూరు కిషన్ రెడ్డి, దానంపల్లి శ్రీనివాస్ లతో పాటు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాళ్ల తిరుపతి, రావుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పత్తెం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు ఏ సుమతి, యం.రాజు, మండల కార్యవర్గ సభ్యులు యం.రాజేందర్, కె రాజయ్య, ఎస్ విజయలత, జి.రాధిక, కె.రజని, జి.ప్రదీప్ మండల శాఖ అధ్యక్షులు కొర్ర గోపి, ఉపాధ్యాయులు మాధవి, రాధ, శ్రీలత, పారిజాత, ఝాన్సీ ప్రసూన, మంథిని శ్రీనివాస్, టి ఆంజనేయులు, పృథ్వీరాజ్, గోపాల్ రెడ్డి, ఆదం, సిఆర్పీలు రాజిరెడ్డి, రవిబాబు, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
