
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందే రాధిక- శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ దంపతులు కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌లను శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘనంగా సత్కరించారు. ఇటీవల పదవి విరమణ చేసిన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను తెలంగాణ భవన్ లో సత్కరించగా పదవి విరమణ చేసిన రాధిక, నిర్మలలు హాజరయ్యారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఐదేళ్లపాటు ఎంతో నిబద్ధతతో ప్రజా సేవ చేసి, మున్సిపల్ ప్రజల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేసిన ప్రజా ప్రతినిధులు అభినందనీయులని ఈ సందర్భంగా మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి జీ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





