
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పలువురు జర్నలిస్టులు ప్రణవ్ నివాసంలో కలవగా వారు తెలిపిన ప్రతి సమస్యను తెలుసుకున్న ప్రణవ్ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ కాయిత రాములు, టీయు డబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణికుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు టీ ఆంజనేయులు, మండల యాదగిరి, కామని రవీందర్, పిల్లల సతీష్, సురుకంటి తిరుపతిరెడ్డితోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

