
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో చిరుతల రామాయణన్ని గ్రామానికి చెందిన తీగల హనుమక్క ఎల్లయ్య జ్ఞాపకార్థం వాళ్ల కుమారుడు తీగల అరుణ్ కుమార్, శనివారం రోజున ప్రారంభించజ ఆదివారం కూడా కొనసాగింది. రామాయణంలో కళాకారులు వారి వారి పాత్రను ప్రదర్శించి, రామాయణా పూర్వ వైభవాన్ని వెలికి తీశారు. ఈ రామాయణాన్ని గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ఒకప్పుడు చిరుతల రామాయణం అంటే ఎంతో ఆసక్తిగా చూసిన గ్రామీణ ప్రజలు నేటికీ ఆ క్రేజీ తగ్గలేదు అంటూ పెద్ద ఎత్తున హాజరై తిలకించడం పలువురిని ఆలోచింపజేస్తుంది.


