
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈతకు వెళ్లి బాలుడు మరణించిన ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన మచ్చ రాజ్ కుమార్ పెద్ద కుమారుడైన మచ్చ వెంకట్ సాయి (11) ఆదివారం ఐదుగురు స్నేహితులతో కలిసి గ్రామంలోని అంకుశావాని కుంట వద్దకు బహిర్ భూమికి వెళ్లారు. అక్కడ స్నేహితులు ఈత నేర్చుకుందామనగా కుంటలోకి దిగారు, ఈత సరిగా రాకపోవడంతో వెంకట సాయి కుంటలోని ఓ గుంతలో మునిగిపోయాడు. మిగతా స్నేహితులు భయంతో గ్రామస్తులకు తెలుపగా ఘటన స్థలానికి చేరుకుని గుంతలో ఇరుకున్న బాలుని బయటకి తీయగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకటసాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


